తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ మరణం నమోదైంది. వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న 69 ఏళ్ల వ్యక్తి శనివారం మృత్యువాత పడ్డాడు. దుబాయ్‌నుంచి ఇండియాకు వచ్చిన సదరు వ్యక్తి ఈనెల 22న నిమోనియా లక్షణాలతో కొచ్చిలోని కాలమస్సేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరాడు. అతడి ఆరోగ్య పరిస్థితి అదుపు తప్పటంతో వెంటిలేటర్‌పై ఉంచారు వైద్యులు. అయితే గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్న అతడు బీపీ విపరీతంగా పెరిగిపోయి మరణించాడు. దీంతో దేశవ్యాప్త కరోనా వైరస్ మరణాల సంఖ్య 21కి చేరింది. భారత్‌లో ఇప్పటివరకు 873 వైరస్ పాజిటివ్ కేసులు నమోదుకాగా, కేరళలో ఆ సంఖ్య 164గా ఉంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావటం గమనార్హం.
కేరళలో తొలి కరోనా మరణం
• VAMMI BALAMMA